నాలో నీవు...నాతో నీవు!!
గుండె గదులలో
మనసు పొరలలో
జ్ఞాపకాల దొంతరలో
ఎక్కడో నీవు నక్కి కూర్చుని ఉంటావు
అప్పుడప్పుడు తొంగి చూస్తుంటావు
గాయాలు ఎన్నటికీ మానిపోవు
జ్ఞాపకాలు ఎప్పడికీ మాసిపోవు
ఎక్కడో కాసింత మచ్చ మిగిలే ఉంటుంది
ఎప్పుడో కూసింత చిచ్చై రేగుతూ ఉంటుంది
నీవు నిన్నైనా, నేడైనా లేక రేపైనా
గుండె శకలాలలో మిగిలి పోతావు
నాతోపాటే చితి మంటలలో రగిలి పోతావు!
Comments