జీవన పయనం
ఎడతెరగని జీవిత పయనం
అలుపెరుగని జీవన గమనం
కరిగిపోయే ప్రతిక్షణం
సాగిపోయే ప్రతిదినం
అవధులులేని పయనం
అంతుతెలియని గమ్యం
కనులు మూసి తెరిచే లోగా
కదలిపోయే కాలం అంచున
స్వప్నవీచికలాంటి పయనం
రాగమాలికలాంటి పయనం
మనస్సు పలికే మౌనాలలోన
పెదవి తెలిపే భావాలలోన
నిత్యవేదనలాంటి పయనం
సత్యగీతికలాంటి పయనం
నిర్ణీత సమయాలలోన
నిర్దేశిత మార్గాలలోన
కాలభ్రమణంతోటి పయనం
కడతేరేవరకు పయనం!!!
Comments