నీవు లేని నేను
నేస్తం నీవు లేవు....
ఈ భూమి తిరుగుతూనే ఉంది
క్రమం తప్పక సూర్యుని చుట్టూ!
సముద్రం నిశ్చలంగానే ఉంది
మింటికెగిరే అలలను చూస్తూ!
ఆకాశం ఉరుముతూనే ఉంది
మాయమయ్యే మెరుపుని తిడుతూ!
ప్రపంచం నడుస్తూనే ఉంది
భయంతో అనుదినం చస్తూ!
జాజితీగ పూస్తూనే ఉంది
వసంతంలో మల్లీ చిగురిస్తూ!
ఆఫీసు పని జరుగుతూనే ఉంది
ఏడాదికొకసారి నిన్ను తలుస్తూ!
అసలు ఇంకొక విచిత్రం
చెప్పనా నేస్తం..........
నా ప్రాణం, నీవు పోయినా
నేను జీవిస్తూనే ఉన్నా
అనుక్షణం నిట్టూరుస్తూ!!!
ఈ భూమి తిరుగుతూనే ఉంది
క్రమం తప్పక సూర్యుని చుట్టూ!
సముద్రం నిశ్చలంగానే ఉంది
మింటికెగిరే అలలను చూస్తూ!
ఆకాశం ఉరుముతూనే ఉంది
మాయమయ్యే మెరుపుని తిడుతూ!
ప్రపంచం నడుస్తూనే ఉంది
భయంతో అనుదినం చస్తూ!
జాజితీగ పూస్తూనే ఉంది
వసంతంలో మల్లీ చిగురిస్తూ!
ఆఫీసు పని జరుగుతూనే ఉంది
ఏడాదికొకసారి నిన్ను తలుస్తూ!
అసలు ఇంకొక విచిత్రం
చెప్పనా నేస్తం..........
నా ప్రాణం, నీవు పోయినా
నేను జీవిస్తూనే ఉన్నా
అనుక్షణం నిట్టూరుస్తూ!!!
Comments