ఆత్మావలోకనం...
తెలుగులో ఒక మంచి పదముంది, (నా ఉద్దేశ్యంలో తెలుగు భాషలో ఉన్న పదాలన్ని మంచివే కానీ కొన్ని కొన్నిపదాలు భావాన్ని వ్యక్తీకరించడంలో సఫలమైనట్టు కొన్ని పదాలు కాలేవు)..
ఇంతకి అసలు విషయానికి వస్తే నేను చెప్పే పదం...ఆత్మావలోకనం
ఎందుకో ఎప్పుడు దీన్ని స్మరించినా ఒక వింత అనుభూతి.
నిన్ను నువ్వు పరిశీలించుకోవడం / పరామార్శించికోవడం / పలకరించికోవడం / పులకరించికోవడం
అబ్బో ఇలా రాస్తూ పోతే ఒకటా రెండా తెలుగు భాషలో పదాలకి కొదవేముంది.
కాని ఇక్కడ భాష ప్రయోగం గురించి నేను మాట్లాడడం లేదు
కేవలం ఒక్క పదం ఎన్ని భావాల సమాహారం అనేదే నా ఉద్దేశ్యం
ఈ ఆత్మావలోకనం అనేది ఉన్నది చూసారు అది మనిషికి చాలా అవసరం
గుండె గొంతుకలోన కొట్టుకులాడే ఊసులని
మనసు ఊయలలో ఊగిసలాడే ఆలోచనలని
కనుల లోగిళ్ళలో రంగ వల్లులు తీర్చే కలలని
పాణి కొసలలో కదలాడే చురుక్కుని
చమక్కులా కనులముందు సాక్షాకరింప చేస్తుంది
ఎక్కోడో జ్ఞాపకాల పొరలలో దాగిన నేస్తాన్ని వెలికి తీసి
కంటి పాపలో ప్రతిబింపచేస్తుంది
గడిచిపోయన కాలం అనే గది గడియ తీసి నిన్ను కాలభ్రమణంకి అతీతమైన లోకంలో విహరింప చేస్తుంది
ఎంత గొప్పదీ ఆత్మావలోకనం
ఎంత హాయి ఈ స్వయం పరిశీలనం
అప్పుడప్పుడు తలుపు తట్టి తలపుల ద్వారం గుండా గుండె పొరలను శ్రుజించి
మోహన రాగాన్ని ఆలపించి చూడండి జన్మ తరించిపోతుంది
Comments