అసందర్భ ప్రేలాపన
నాకు నీవు, నీకు నేను
అంతా సందర్భానుసారమే
అనుబంధాలు ఆత్మీయతలు
అన్నీ అలంకారప్రాయమే
నవ్వినపుడు నలుగురూ నీవాళ్ళే
కష్టాలు-కన్నీళ్ళు
నీకు మాత్రమే అనుభవైకనైవేద్యం
నీవు తల దించితే నిశబ్ధం కూడా
నిన్ను నిలదీస్తుంది...
ఎదురు తిరిగితే తూట కూడా
మోకరిల్లుతుంది !!
బ్రతుకు అడిగి రాదు
చావూ.. చెప్పి రాదు
రెండూ సంశయాలే!
జీవన గమనంలో
రెండూ సంక్షిప్తాలే!!
Comments