అమృత హస్తం..
చీకట్లోనే వెలుగు కిరణం పట్టుకుంటా!
అడ్డువచ్చిన గోడలు చేదించి నిలబడతా!
పోరాటం నా ఊపిరి మరి!!
కొన్ని సార్లే.....
ఈ అంతర్మధనం ఆపాలని ఆలోచిస్తా!
చీకటిని తరమాలనే నా ఆరాటాన్ని
అదమాలని ప్రయత్నిస్తా!
నన్ను నేను మరిచి పిచ్చిదాన్ని అవుతా!
అప్పుడే నన్ను ఆప్యాయంగా తడుతుంది!
నా పోరాటం చివురు పోసుకుంటుంది!
నన్ను కర్తవ్యముఖురాలిని చేస్తుంది!!
నేస్తం!!
నీ అమృత హస్తం!!!!!
Comments