ఎక్కడో....
ఎక్కడో, ఏ దారిలోనో, ఓ పూలపొదవై
ఒక్కసారైనా నాకు ఎదురు రారాదా...
ఎన్నడో, ఏ మబ్బుతునకలోనో దాగి,
ఒక్కమారైనా నాపై కురిసి పోరాదా...
ఎప్పుడో, ఏ పిల్లతెమ్మరతోనో కలిసి,
ఒక్క క్షణమైనా నను తాకి పోరాదా ...
ఇవన్నీ ఎందుకు....
ఎంచక్కా సూరీడుతో నీవు స్నేహంచేసి ...
పగలంతా నాతో జత కట్టరాదా...
చందమామామతో కాస్త చుట్టరికం కలిపి
రేయంతా నాతో ఉండి పోరాదా.....
నాలోన నీవు.... నిండి పోరాదా!!!
ఒక్కసారైనా నాకు ఎదురు రారాదా...
ఎన్నడో, ఏ మబ్బుతునకలోనో దాగి,
ఒక్కమారైనా నాపై కురిసి పోరాదా...
ఎప్పుడో, ఏ పిల్లతెమ్మరతోనో కలిసి,
ఒక్క క్షణమైనా నను తాకి పోరాదా ...
ఇవన్నీ ఎందుకు....
ఎంచక్కా సూరీడుతో నీవు స్నేహంచేసి ...
పగలంతా నాతో జత కట్టరాదా...
చందమామామతో కాస్త చుట్టరికం కలిపి
రేయంతా నాతో ఉండి పోరాదా.....
నాలోన నీవు.... నిండి పోరాదా!!!
Comments