మన బంధం
భానుడు ప్రచండంగా వెలిగేటివేళ
జాబిలి వెన్నెలలు వెదజల్లేటివేళ
ప్రకృతిమాత ఆదమరిచి పవళించేటివేళ
పక్షులు కిలకిలా రావములు చేసేటివేళ
ఆనందదారలు మదినుప్పొంగేటివేళ
ప్రేమ కోసం నే పరితపించేవేళ
కనులలో కన్నీరు కారేటివేళ
ఓదార్పు కోసం అలమటించేటి వేళ
వస్తుంది సుడిగాలిలా నీ జ్ఞాపకం
అవుతుంది మనసు కల్లోల సంద్రం
నా తరమా మరుచుట మన మధురాతి బంధం!!
Comments