విరహ గీతం
నిన్న నాతో నువ్వు
నేడు నాలో నువ్వు
నిన్న నే వినిపించిన రాగం
నేడు నే కనిపించని మౌనం
నిన్న నే విరిసిన నందనవనం
నేడు నే కురిసిన శ్రావణ మేఘం
నిన్న నా అణువు అణువునా నువ్వు
నేడు నా మది నిండా నువ్వు
నిన్న నే వెలిగించిన దీప సమూహం
నేడు నే స్వయంజలిత హారతి కర్పూరం!!!
Comments