నిజంలాంటి అబద్దం
నిశబ్దమైన నిశీధిలో
నిట్టూర్పుల శ్వాసలలో
నిజంలాంటి అబద్దమైన నీవు
కలలాంటి నిజమై వస్తావు
కనుపాపలలో నిండి పోతావు
గుండెలయలో ఇంకి పోతావు
నీ రాకతో
కలతతో కలవరపడిన హృదయం
ఉలిక్కిపడి మేల్కుంటుంది
మూసిన కనులతోనే నిను తడుముతుంది
నిస్తేజమైన దేహం కదులుతుంది
కనులు తెరిచి చూసేలోగా
గుండెలో నీ జ్ఞాపకం ముళ్ళును గుచ్చి
నీవు మాత్రం వెళ్లిపోతావు
కనులలో కన్నీరుగా మిగిలిపోతావు!!!
Comments