అనుభవం
ఉదయభానుని లేలేత కిరణాలు
అంతు తెలీని నీలి సంద్రాలు
చిరుగాలికి తలలూపేటి లతలు
చెవిచేరే కోకిల స్వరగానాలు
నా భాషా పరిజ్ఞానమంతటిని ఉపయోగించి
విడమర్చి, వివరించి చెప్పగలనే కానీ
ఆ లేత కిరణాల నులివెచ్చదనం
కడలితరంగం తెచ్చే స్పర్శానుభవం
ఆకుల కదలికలు తెచ్చే చల్లదనం
కోకిలగానంలోని మృదుమధురభావం
చూపగలదా నా జీవంలేని కలం
అక్షరాలకు అందనిది ఈ అజ్ఞాతనుభవం!!
అంతు తెలీని నీలి సంద్రాలు
చిరుగాలికి తలలూపేటి లతలు
చెవిచేరే కోకిల స్వరగానాలు
నా భాషా పరిజ్ఞానమంతటిని ఉపయోగించి
విడమర్చి, వివరించి చెప్పగలనే కానీ
ఆ లేత కిరణాల నులివెచ్చదనం
కడలితరంగం తెచ్చే స్పర్శానుభవం
ఆకుల కదలికలు తెచ్చే చల్లదనం
కోకిలగానంలోని మృదుమధురభావం
చూపగలదా నా జీవంలేని కలం
అక్షరాలకు అందనిది ఈ అజ్ఞాతనుభవం!!
Comments