ఏం చేసుకుంటాం?
పండువెన్నెలనేం ఆస్వాదించగలం
ముళ్ళపొదలో కాళ్ళు తడబడినప్పుడు
గులాబీల గుబాళింపునేం ఆఘ్రానించగలం
జీవితం హోరెత్తే రణరంగమైనప్పుడు
సరిగమల సంగీతాన్నేం పాడుకుంటాం
బ్రతుకు బండి కుదేలై కూర్చునప్పుడు
పరుగులెత్తే పరువాన్నేం చూసుకుంటాం
గుండె చిధ్రమై రక్తమోడుతున్నప్పుడు
బదులు పలకని ప్రేమనేం చేసుకుంటాం
మనసు మౌనతీరాలు చేరుకున్నప్పుడు
మనిషి చేసిన బాసలను ఏం చేసుకుంటాం
Comments