నీవుంటే.....
నీ కన్నుల వెలుగుల్లో నే దీపతోరణం
నీ నవ్వుల పున్నమిలో నే వెన్నెలవర్షం
నీ పలుకుల భావాలలో నే మౌనరాగం
నీ తలపుల మజిలీలో నే చివరిగమ్యం
నీ ప్రేమపాశంలో నే జీవిత ఖైధీ
నీ వలపు కౌగిలిలో నే సదా బంధీ
నీ సన్నిధిలో గడిపిన ప్రతిక్షణం
మరపురాని అనుభవం!!
మధురమైన ఆ ప్రతిక్షణం
మరలి రావాలి అనుదినం!!!
Comments